జీడిమెట్ల, వెలుగు: దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో బుధవారం ఏబీసీ అధికారులు నిర్వహించిన అకస్మిక తనిఖీలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. టౌన్‌ప్లానింగ్ విభాగంలో సూపర్‌వైజర్ లంచాలు వసూలు చేసినట్లు వాట్సాప్ చాట్ ఆధారాలు లభించాయి. జీ ప్లస్ త్రీ అనుమతులు ఉన్న భవనాలకు జీ ప్లస్ ఫైవ్ వరకు అనుమతులు మంజూరు చేసినట్లు తేలింది. 32 అక్రమ నిర్మాణాల్లో 28 భవనాలకు రెండో నోటీసులు జారీ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్, ఐదుగురు అవుట్‌సోర్సింగ్ సిబ్బంది అనుమతి లేకుండా గైర్హాజరైనట్లు తేలింది. హాజరు రికార్డులను ఎస్‌ఎఫ్‌ఏలు తారుమారు చేసినట్లు బయటపడింది.
